రేపు సాయంత్రం విడుదల కానున్న “బ్రో” టీజర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా “బ్రో”.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ మల్టీస్టారర్ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. రేపు సాయంత్రం 5:04గంచలకు “బ్రో” సినిమా టీజర్ విడుదల చేస్తామని చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారినపడ్డారు. అయితే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆయన ఈ రోజు “బ్రో” టీజర్ కోసం తన డబ్బింగ్ చెప్పారు. కాగా వచ్చే నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పవన్ కళ్యాణ్,సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

