భారత్‌కు బ్రిటన్ క్షమాపణలు..
భారతదేశం ఎన్నడూ మరిచిపోలేని దుర్ఘటన శతాబ్దం క్రితం జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ . 1919 వ సంవత్సరంలో ఏప్రిల్ 13న శాంతియుతంగా మీటింగ్ నిర్వహించుకుంటున్న అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన జనరల్ డయ్యర్ దుశ్చర్యను బ్రిటన్ పార్లమెంట్ గుర్తు చేసుకుంది. ఆనాడు ఆయన పోలీసుల వద్ద ఉన్న బుల్లెట్లు పూర్తయ్యేవరకూ కాల్పులు జరపాలని ఆదేశించారు. ఈ ఘటనలో దాదాపు 3 వేల మంది మృతి చెందారు. ఇది జరిగిన వందేళ్ల తర్వాత 2019లో అప్పటి యూకే ప్రధాని థెరిసా మే దీనిని బ్రిటిష్ సామ్రాజ్యంపై మాయని మచ్చగా అభివర్ణించారు. ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 13 రాబోతోంది. ఈ సంవత్సరమైనా భారత ప్రజలకు బ్రిటన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ యూకే పార్లమెంట్‌లో డిమాండ్ చేశారు. వందేళ్లు దాటినా ఆ గాయాలు భారత్‌ను బాధపెడుతూనే ఉన్నాయని ఆవేదన చెందారు. ఈ మారణకాండను గుర్తు చేసుకుని అప్పటి భారతీయులపై బ్రిటిష్ పాలకులు జరిపిన ఈ దురాగతానికి బ్రిటన్ ప్రభుత్వం యూకే పార్లమెంట్ వేదికగా క్షమాపణలు చెప్పాలని యోచిస్తోంది.