కుప్ప కూలిన బ్రిడ్జి..ముగ్గురు మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నది పై ఉన్న గంభీర్ వంతెన బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 10 మందిని రక్షించారు. చిక్కుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఈ వంతెన 45 ఏళ్ల కిందట నిర్మించిందిగా అధికారులు తెలిపారు. చాలా కాలంగా ఇది శిథిలావస్థలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.