లంచగొండి ఎస్సై అరెస్ట్
రేషన్ బియ్యం కేసులో లంచం తీసుకుంటూ ఎస్సై సహా ఓ కానిస్టేబుల్ పట్టుబడిన ఘటన తిరుమలగిరిలో సంచలనం సృష్టించింది.రేషన్ బియ్యం బస్తాలున్న వాహనాన్ని రిలీజ్ చేయాలన్నా,కేసులు నమోదు కాకుండా చూడాలన్నా పెద్ద మొత్తంలో లంచం ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు డిమాండ్ చేయడంతో ఓ బాధితుడు గత్యంతరం లేక ఏసిబిని ఆశ్రయించాడు.దీంతో పీడీఎస్ రేషన్ బియ్యం కేసులో రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఏసిబి అధికారుల వలకు చిక్కారు.నిందితుల వేలిముద్రల ఆధారంగా వివరాలు నమోదు చేసుకుని ఆరెస్ట్ చేశారు.ఏసిబి కోర్టులో హాజరు పరిచారు.