వాసు దేవుని బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్సులు..
అత్యంత భక్తి, శ్రద్దలు, విశ్వాసంతో బ్రహ్మోత్సవాల్లో రథయాత్ర నిర్వహిస్తాం. కాని ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథయాత్ర అర్చకులు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తి, భజనలకు బదులుగా మాస్ పాటలు ప్లే చేయడం.. వాటికి పూజరులు, అర్చకులు బ్రేక్ డ్యాన్సులు చేయడం చర్చనీయాంశమైంది. ఆలయంలో ఉండే పూజారులే ఈవిధంగా భగవంతుడి పట్ల, భక్తి కార్యక్రమాల పట్ల ప్రవర్తిస్తే ఎలా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి వేడుకల్లో ఇవేం పిచ్చి డ్యాన్సులు అంటూ భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి సంఘటన కాని.. వీడియో కాని చూసి ఉండరు. వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్లు చేయడం ఇదే మొట్ట మొదటిసారి.

