మూవీపై కేసీఆర్ పొలిటికల్ బ్రహ్మాస్త్ర
బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగక పోవడం వెనుక పలు అనుమానాలు బయటకు వస్తున్నాయి. సెప్టెంబర్ 3 బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్‌సిటిలో ఘనంగా నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేసారు చిత్రబృందం. కానీ ఊహించని రీతిగా దీనిని రద్దు చేశారు. గణేష్ చతుర్ధి రద్దీ కారణంగా తమకు సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేయడంతో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చినట్టు సమాచారం. అప్పటి వరకు అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఈవెంట్ ప్రారంభం రోజున ఇలా చేయడంపై విమర్మలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అయితే అప్పటి వరకు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంపై కోపంతో, కావాలనే ఇలా చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. మనావర్ షో కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.. కానీ బ్రహ్మాస్త్రకు మాత్రం గణేష్ చతుర్ధి రద్దీ అంటున్నారు ఎందుకు అనే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయినందున, కేసీఆర్ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా గాని బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా కేసీఆర్ ప్రభుత్వం మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈవెంట్ విషయంపై స్పందిస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు కూడా చెప్పారు.

