మెదడు తినే వ్యాధి సోకి బాలుడు మృతి
ఓ బాలుడికి వింతైన వ్యాధి సోకింది. అయితే ఈ వ్యాధి అమీబా వల్ల కలిగినట్లు తెలుస్తోంది. కాగా కలుషిత నీటిలో ఉండే ఓ అమీబా 15 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. కేరళ రాష్ట్రంలోని అలప్పుజాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ అమీబా బాలుడి ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించిందని వైద్యులు వెల్లడించారు. ఈ విధంగా బాలుడి మెదడులోకి ప్రవేశించిన అమీబా అక్కడ ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేసిందని వైద్యులు తెలిపారు. దీనివల్ల ఆ బాలుడు ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటీస్ అనే వ్యాధికి గురయ్యాడని ఆ రాష్ట్రమంత్రి వీణా జార్జ్ స్పష్టం చేశారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా అమీబా బాలుడి మెదడును పూర్తిగా తినేసిందని వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యాధి తోలుత జ్వరం,తలనొప్పి,వాంతులతో మొదలై మరణం సంభవిస్తుందని అధికారులు తెలిపారు.