ఫ్రాన్స్‌లో బాంబు బెదిరింపులు- పలు విమానాశ్రయాలు ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఫ్రాన్స్‌లో ఒకేసారి 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. పలు విమానాశ్రయాలను హుటాహుటిన ఖాళీ చేయించారు అధికారులు. ప్రజలు ఏం జరుగుతోందో తెలియక భయాందోళనలకు గురయ్యారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం జరుగుతున్న ఈసమయంలో ఇలాంటి వార్తలు రావడంతో ఫ్రాన్స్ బిత్తరపోయింది. లిల్లె ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్ వచ్చింది. తరువాత వెంటవెంటనే బ్యూవైస్, టోలౌస్,నైస్, లియాన్, నాంటెస్ ఎయిర్ పోర్టులకు బెదిరింపులు రావడంతో మొత్తం ఫ్రాన్స్ భద్రతా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నైస్ ఎయిర్ పోర్టులో ఒక బ్యాగ్ అనుమానాస్పదంగా ఉందని సమాచారం. అయితే లిల్లె ఎయిర్ పోర్టులో ఏమీ దొరకకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఫ్రాన్స్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కూడా భద్రతా బలగాలను మొహరించారు.

