విమానంలో బాంబు బెదిరింపు..
కోల్‌కతా నుండి ముంబయి వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ కోల్‌కతా విమానాశ్రయానికి ఫోన్ వచ్చింది. దీనితో విమానంలోని 195 ప్రయాణికులకు కిందికి దించి, తనిఖీలు చేపట్టారు సిబ్బంది. ఈ విమానం మధ్యాహ్నం బయలుదేరాల్సి ఉండగా బాంబు బెదిరింపు రావడంతో అత్యవసర ప్రకటన చేసి ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. బాంబు నిర్వీర్యబృందాలతో గాలించగా ఏమీ లేదని తేలింది.