Breaking NewsHome Page Sliderhome page sliderNewsNews AlertTelanganaTrending Todayviral

బీజేపీ ఎంపీ కీ తెలంగాణ రోడ్డు కాంట్రాక్టు లు…

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,600 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకంలో సీఎం రమేశ్ రేవంత్‌రెడ్డికి మద్దతు ఇవ్వడం, కమీషన్లు ఇప్పించడం వంటి చర్యల ఫలితంగా, ‘క్విడ్ ప్రో కో’ ఒప్పందంలా ప్రభుత్వం ఈ భారీ కాంట్రాక్టును అప్పగించిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌వీఎస్‌పీ విలీన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ సర్కారు అవినీతిపై కేంద్ర ప్రభుత్వానికి సాక్ష్యాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సిగ్గుచేటుగా పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య తెలంగాణలో రాజకీయ అక్రమ సంబంధం నడుస్తోందని, రాష్ట్రాన్ని దోచుకుంటున్న రేవంత్ రెడ్డిని మోదీ ప్రభుత్వం కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్‌కు ప్రజల మద్దతు లేదని, ఆయనపై ఉన్న నాటకీయతే ఆయన్ను గెలిపించిందని విమర్శించారు. సోనియాగాంధీ రాసిన లేఖను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని స్థాయిలో ఉన్న రేవంత్‌ ప్రసంగాలను చూస్తే, ఆయనకు ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి ఉద్యమాల పాత్రను గుర్తు చేసిన కేటీఆర్, కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమమే రాష్ట్రానికి ప్రాణం పోసిందని అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో దళిత విద్యార్థిని అవమానించిన ఘటనను ఉదహరిస్తూ, రేవంత్‌కు అక్కడే సన్మానం చేయడం ద్వారా అధికారులపై హెచ్చరిక ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, అధికార దుర్వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలు ఇది గమనిస్తున్నారనీ, తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.