బీజేపీ మీడియా ప్రకటన
శ్రీమతి విజయశాంతి బీజేపీపై చేసిన అనవసర ప్రకటనలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి వ్యర్ధ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు. అయితే, ఆమె BJP లోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లో ఆమెకు పెద్ద పదవులు ఇచ్చిన పార్టీపై బురద జల్లకుండా ఉండాల్సింది. వెళ్లేటప్పుడు ఒక స్థాయి, మర్యాద ఉండాలి. పార్టీ కార్యకర్తలు ఇట్లాంటి బాధ్యతల కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తారు. శ్రీమతి విజయశాంతి స్వల్పకాలిక రాజకీయ వలసదారు మరియు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి సీజన్‌లో పార్టీలు మారుతుంటారు. బిజెపికి వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రకటనలు అహంకారపూరితమైనవి, అవకాశవాదమయినవి, మరియు పనికిరానివి.
-18 నవంబర్ 2023న జారీ చేయబడింది: కె.కృష్ణ సాగర్ రావు
ముఖ్య అధికార ప్రతినిధి, బీజేపీ తెలంగాణ రాష్ట్రం