Home Page SliderTelangana

ప్రజల కోరికలను తీర్చేలా బీజేపీ మేనిఫెస్టో-ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్: కుటుంబ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రాష్ట్ర ప్రజల మంచిని కోరే పార్టీలు కావన్నారు. పదేళ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వని కేసీఆర్.. దాని గురించి ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం రాయడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లలో చేయని పనులు పది రోజుల్లో ఎలా చేస్తారని నమ్మమంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో పనిచేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రజలకోసం పనిచేసే నాయకుడు ఎవరనేది ప్రజలు గమనించి.. ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే మోడీ రావల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిలా ఉంటుందని లక్ష్మణ్ చెప్పారు.