పుట్టుక నీది.. చావు నీది..బ్రతుకంతా దేశానిది
నేడు ” పుట్టుక నీది..చావు నీది..బ్రతుకంతా దేశానిది ” అనే నినాదాన్ని చాటిన ఉద్యమకారుడు , ప్రజాకవి కాళోజి జయంతి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతోంది. తెలంగాణ యాసను , భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో కవితలు రాశారు. ఆయన రాసిన ‘నా గొడవలో’ ద్వారా తెలంగాణ ప్రజల గోసను , కష్టాలను ప్రపంచానికి తెలియజేశారు. కాళోజికి 1992లోనే పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు.

