Home Page SliderTelangana

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంపై బిల్లు?

తెలంగాణ: భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 122 రెవెన్యూ చట్టాలన్నింటినీ ఒకే చట్టంగా రూపొందించాలని భావిస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌నూ మార్చనున్నట్లు సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.