Home Page SliderNational

రాఖీ రోజున బీహార్ సీఎం వింత చర్య.. ఎందుకంటే

రాఖీ పర్వదినాన బీహార్ సీఎం నితిష్ కుమార్ చేసిన ఒక పని వింతగా తోచింది. ఆయన రాజధాని వాటికలో డిప్యూటీ సీఎంలతో కలిసి మొక్కలు నాటారు. అంతే కాక అక్కడ ఉన్న ఒక చెట్టుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతోనే తాను ఇలా చేశానని పేర్కొన్నారు. బీహార్‌లో పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం 2012 నుండి రక్షాబంధన్ దినోత్సవాన్ని వృక్ష సురక్షా దివస్‌గా పాటిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ హరియాలి మిషన్ కింద మొక్కలు నాటి, ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోందని సీఎంవో పేర్కొన్నారు. కుటుంబసభ్యులకే కాక ప్రకృతికి కూడా రక్ష కట్టే సంప్రదాయం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఉందని, అక్కడి ప్రజలు రాఖీ రోజున అడవి వద్ద చెట్లు, మహా వృక్షాలకు రాఖీలు కడుతుంటారని పేర్కొన్నారు. దీనిని జంగిల్ రక్షా బంధన్ అని పిలుస్తారని, దీని ప్రాముఖ్యాన్ని దేశదేశాలలో చాటాలన్నదే తమ ఆశయంఆశయంతో ఈ జంగిల్ రక్షా బంధన్‌ను పాటిస్తున్నాని పేర్కొన్నారు.