ఉబర్‌కి భారీ షాక్..
ఉబర్ ఇండియాకు సేవల్లో లోపం కారణంగా భారీ షాక్ తగిలింది. దీనితో రూ. 54 వేలు కస్టమర్‌కి చెల్లించాల్సి వచ్చింది. ఉబర్ క్యాబ్ బుక్ చేసినప్పటికీ డ్రైవర్ స్పందించకపోవడంతో ఒక ప్రయాణికుడు విమానం అందుకోలేకపోయాడు. దానివల్ల మరో విమానం బుక్ చేసుకోవలసి వచ్చింది. అంతేకాక తిరుగు ప్రయాణం టికెట్ కూడా బుక్ చేసుకోవడంతో కుటుంబంతో కూడా ఎక్కువసేపు గడపకుండానే వెనుదిరిగి రావడానికి కూడా కారణమైంది. ఢిల్లీకి చెందిన వైద్యుడు ఉదయం 3 గంటలకు ఉబర్ క్యాబ్‌ను బుక్ చేశాడు. బుకింగ్ అయ్యింది. దీనితో క్యాబ్ కోసం ఎదురుచూశాడు. కానీ ఎంతకీ క్యాబ్ రాలేదు. ఫోన్ చేసినా ఉబర్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేశాడు. అయితే వారు కూడా రెస్పాండ్ అవకపోవడంతో వేరే ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లాడు. కానీ అప్పటికే విమానం వెళ్లిపోయింది. దీనితో మరో విమానం అధికధరకు బుక్ చేసుకుని వెళ్లాడు. ఈ ఘటన తర్వాత ఉబర్‌పై జిల్లా కస్టమర్ కోర్టులో కేసు వేయడంతో ఉబర్‌కు భారీగా జరిమానా విధించింది. మరో క్యాబ్ బుక్ చేయాల్సిందని ఉబర్ వాదించినా కోర్టు కొట్టిపడేసింది. అతనికి మరో విమానం టికెట్‌కు అయిన రూ.24 వేలు, అతని మానసిక ఒత్తిడికి కారణమయినందుకు మరో రూ.30 వేలు కలిపి పిటిషనర్‌కు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

