అమెజాన్‌కు భారీ షాక్..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌కు భారీ షాక్ తగిలింది. అమెజాన్ వేదికపై కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు సరైన బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో హైదరాబాద్ అమెజాన్ వేర్ హౌస్‌లో సోదాలు జరిపి ఇలాంటి వస్తువులను సీజ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల పరిధిలోకి కొన్ని వస్తువులు లేవని గుర్తించారు. వీటిలో స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రిక్ హీటర్లు, సీసీటీవీ కెమెరాలు, వైర్‌లెస్ ఇయర్ బడ్స్, బొమ్మలు, మొబైల్ ఛార్జర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.50 లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

