Home Page SliderTelangana

రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం-ఈటల రాజేందర్

వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారన్నారు ఈటల రాజేందర్. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దు.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజలు బతికి బట్టి బట్టకట్టరన్న అభిప్రాయంతో ఉన్నారన్నారు. అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద అదరగొట్టిన కేసీఆర్ కాళేశ్వరం మీద సమాధానం చెప్పడం లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు. కచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని, కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర అంతా కూడా కళ్ల ముందు కదలాడుతుందన్నారు. ఇదేం కొత్త పార్టీ కాదు. ఇవాళ కొంతమంది చేరుతున్నప్పుడు కొంత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.. కానీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదన్నారు ఈటల.

2014లో కౌన్సిల్లో ఉన్న సభ్యులందరూ టిఆర్ఎస్ పార్టీలో చేరారన్న విషయాన్ని మరవద్దొన్నారు. 2018లో 19 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి గెలిస్తే 12 మంది శాసనసభ్యులు మేము పార్టీని రద్దు చేసుకుంటున్నాం.. మెర్జ్ చేసుకుంటున్నమని ప్రకటించి..కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే టీఆర్ఎస్‌లో కలిపేసిన చరిత్ర చూస్తూ ఉన్నారన్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మనం వద్దనుకుంటున్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే అవకాశం ఉందన్నారు. కాబట్టి బరికేసి కొట్లాడే, మంచి పరిపాలన అందించే శక్తి సత్తా.. భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎట్లా పురోగమిస్తుందో చూస్తున్నామన్నారు. తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే.. నరేంద్ర మోడీ గారి అండదండలు ఉంటేనే.. కేంద్ర సర్కారు సపోర్ట్ ఉంటేనే సాధ్యమవుతుంది అని భావిస్తున్నామన్నారు ఈటల.

ఎవరికి ఎన్ని రాతలు రాసిన.. ఎవరు ఎన్ని కథనాలు వేసినా నూటికి నూరు శాతం తెలంగాణ ప్రజలు, నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భావనతో ఉన్నారన్నారు ఈటల రాజేందర్. ఇందులో భాగంగానే గ్రామాలకు పోతున్నప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోందన్నారు. అనేకమంది కాంగ్రెస్ నుండి, బిఆర్ఎస్ నుండి చేరుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ ఊరికి వెళ్లిన కూడా నిరసన సెగలు తగులుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని విశ్వాసంతో ముందుకు పోతున్నామన్నారు ఈటల రాజేందర్.