Home Page SliderNational

మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి భారత రత్న

బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ప్రకటించారు. ఎల్‌కె అద్వానీ మన కాలంలో అత్యంత గౌరవనీయమైన రాజనీతిజ్ఞులు, భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమని ప్రధాని అన్నారు. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వబడుతుందని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మోదీ. తాను అద్వానీతో మాట్లాడనన్న మోదీ… ఈ గౌరవం లభించినందుకు అభినందనలు తెలిపానని చెప్పారు. అద్వానీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అనేక మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించడంతో పాటు ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. అతను 1970 – 2019 మధ్య పార్లమెంటు సభ్యుడుగా వ్యవహరించారు.

అట్టడుగు స్థాయిలో పని చేయడం నుండి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయని చెప్పారు ప్రధాని మోదీ. హోం మంత్రిగా, I&B మంత్రిగా కూడా గుర్తింపు పొందారు అద్వానీ. రాజకీయ నీతిలో ఒక ఆదర్శప్రాయమైన ప్రమాణంగా అద్వానీ స్థిరపడతారన్నారు. ప్రజా జీవితంలో అద్వానీ దశాబ్దాల సుదీర్ఘ సేవ రాజకీయ నీతిలో ఒక ఆదర్శప్రాయమైన ప్రమాణాన్ని నెలకొల్పుతూ పారదర్శకత, సమగ్రత పట్ల తిరుగులేని నిబద్ధతతో పనిచేశారన్నారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన అసమానమైన కృషి చేశారన్నారు. ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. అద్వానీతో సంభాషించడం, నేర్చుకోవడానికి నాకు లెక్కలేనన్ని అవకాశాలు లభించడం అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తానని మోదీ చెప్పారు.