Home Page SliderNational

యంగ్‌స్టేట్‌ తెలంగాణాకు శుభాకాంక్షలు: రాహుల్ గాంధీ

నేడు తెలంగాణా అవతరణ దినోత్సవం ఈ  సందర్భంగా దేశంలోని ప్రముఖలు తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణా  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోనే యంగెస్ట్ స్టేట్ తెలంగాణా. తెలంగాణా ప్రజల ధృడమైన స్ఫూర్తికి ప్రసిద్ధి చెందింది. ఉజ్వలమైన తెలంగాణాను నిర్మించడానికి ,రైతులు ,యువత,మహిళలకు శ్రేయస్సు కట్టుబడి ఉంది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే రాహుల్ అమెరికా పర్యటనకు అక్కడి ప్రజల నుంచి విశేషమైన స్పందన కన్పిస్తోంది.