సెంట్రల్ యూనివర్శిటీకి బాత్రూం సెగ
అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధినిలు సోమవారం క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు.గుర్తు తెలియని అగంతకులు తమ బాత్రూమ్‌ల లోకి తొంగి చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని వీసి దృష్టికి తీసుకెళ్లారు.అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.పోలీసులకు తాము ఫిర్యాదు చేయమని యూనివర్శిటీ అధికారులు ఖరాకండిగా తేల్చిచెబుతున్నారు.అయితే విద్యార్ధినిలు ఫిర్యాదు చేస్తే తాము కేసు నమోదు చేసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో సోమవారం తరగతులు బహిష్కరించి ధర్నాకు దిగారు విద్యార్ధినిలు.