బాసర ట్రిపుల్ ఐటి విద్యార్ధి సూసైడ్
పేదరికం నేపథ్యంతో స్టార్ట్ అయిన హాస్టల్ చదువులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.ఆత్మాభిమానం,పరువు కారణాంశాలతో సర్కారీ విద్యాలయాల గడపలు తొక్కుతున్న విద్యార్ధులు ఆత్మహత్యలే శరణ్యంగా జీవిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటిలో విద్యనభ్యసిస్తున్న ఆర్మూర్ ప్రాంతం పెర్కిట్ కి చెందిన స్వాతి అనే విద్యార్ధిని హస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ ని కూడా రాసింది.తన చావుకి వేరెవరూ కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే తాను చనిపోతున్నాననంటూ నోట్‌లో పేర్కొంది.కాగా సహచర విద్యార్ధులు మృతి వార్తను యాజమాన్యానికి తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి విచ్చేసి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.