“ప్రజల ఖాళీ జేబులను కూడా బ్యాంకులు దోచుకుంటున్నాయి”- రాహుల్ గాంధీ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రభుత్వంపై ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో విమర్శలు సంధించారు. ప్రజల ఖాళీ జేబులను కూడా వదలటం లేదని, బ్యాంకులు దోపిడీయే లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. పెనాల్టీ విధానంలో కనీస నెలవారీ బ్యాలెన్స్ చూపని వినియోగదారుల నుండి బ్యాంకులు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. గత ఐదేళ్లలో వినియోగదారుల నుండి రూ.8,500 కోట్ల రూపాయలు జరిమానాలు వసూలు చేశారని ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరీ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని బట్టి ఈ విషయం స్పష్టమయ్యిందని పేర్కొన్నారు. సగటు భారతీయుడు నడ్డి విరుస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోదీ అమృతకాలంలో కూడా డిపాజిటర్ల నుండి, ప్రజల నుండి పెనాల్టీలు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ తమ మిత్రులైన పారిశ్రామిక వేత్తలకు మాత్రం వేల కోట్లు రుణమాఫీ చేస్తోందన్నారు. దాదాపు రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిందని సాక్ష్యాలున్నాయన్నారు. కానీ రైతులు తీసుకునే కాస్త రుణాలకు మాత్రం మాఫీ జరగట్లేదన్నారు. ప్రజలు మీ పద్మవ్యూహంలో చిక్కికోవడానికి అభిమన్యులు కారు. అర్జనుడిలా మీ దురాగతాలకు ఓటుతో సమాధానం చెప్తారని పేర్కొన్నారు.

