పట్టపగలే బ్యాంకు దోపిడీ
కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్ననే బీదర్‌లో ఏటీఎం వాహనంపై కాల్పులు జరిపి రూ.93 లక్షలు దోచుకుపోయిన ఘటన మరువకముందే కర్ణాటకలోనే దక్షిణ కన్నడ జిల్లాలో ఉల్లాల్ కేసీ రోడ్డులో ఒక బ్యాంకులో పట్టపగలే దోపిడీ జరిగింది. ఈ బ్యాంకులో తుపాకులతో ప్రవేశించిన దోపిడీ ముఠా ఉద్యోగులు, ఖాతాదారులను బెదిరించి, భారీ మొత్తంలో నగదు, బంగారం దోచుకుని పరారయ్యారు. వీరు ఫియట్ కారులో వచ్చిన ఐదుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు తర్వాత మంగుళూరు వైపు పరారయ్యారని సమాచారం.

