బంజారాహిల్స్ ‘డీఏవీ’ స్కూలు ఘటనలో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష ఖరారు
నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు డీఏవీ స్కూల్ నిందితునికి 20 ఏళ్ల పాటు జైలుశిక్ష విధించింది. గత ఏడాది ఆక్టోబరు 19న ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్కూలు ప్రిన్సిపాల్ డ్రైవర్ రజనీకుమార్ అరెస్టయ్యాడు. నేడు ఈ కేసుపై తీర్పు వెలివడింది. నిందితునికి ఆరు నెలలు తిరగకుండానే శిక్షవిధించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. స్కూల్ ప్రిన్సిపాల్‌కు నమ్మకంగా డ్రైవర్‌గా ఉంటూ, ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరలోని కంప్యూటర్‌ల్యాబ్‌లో యూకేజీ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఇలాంటి పనులు చేసినట్లు చిన్నారుల నుండి తల్లిదండ్రుల నుండి రిపోర్టులు రావడంతో డ్రైవర్ రజనీకుమార్‌ను, అతనిపై చర్యలు తీసుకోని స్కూల్ ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారు పోలీసులు. తల్లిదండ్రులు పెద్దపెట్టున నిరసనలు చేపట్టడంతో స్కూలు సీజ్ చేసి, గుర్తింపును రద్దు చేసింది తెలంగాణా ప్రభుత్వం.

