Home Page SliderNews AlertTelanganatelangana,

ఢిల్లీ ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఉన్నారని, ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలో కాషాయ జెండా ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఈ విషయం తాము ముందే ఊహించామన్నారు. ఆప్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలు, జైలు శిక్షలు వంటి వాటితో ప్రజలు విసిగిపోయారని, అందుకే ఆ పార్టీకి బుద్ది చెప్పారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా అభివృద్ధిని కోరుకుంటున్న మేధావి వర్గం అంతా బీజేపీకే ఓటు వేశారన్నారు. ఢిల్లీలో గెలుపు సాధించినట్లే, తెలంగాణలో కూడా గెలుస్తామని, అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.