కుటుంబంతో సహ గన్‌మెన్ ఆత్యహత్య
తెలంగాణాలోని సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది.సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆకుల నరేష్ కుటుంబంతో సహ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా నరేష్ తన భార్య,ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు.అనంతరం తాను కూడా అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసులు ముందుగా కలెక్టర్ గన్‌మెన్ నరేష్ ఆత్నహత్యకు గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణలో గన్‌మెన్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ ఘటన చిన్నకొడూర్ మండలం రామునిపట్లలో జరిగింది.అయితే గన్‌మెన్ నరేష్ కుటుంబంతో సహ ఆత్మహత్య చేసుకోవడంతో రామునిపట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం పోలీసులు గన్‌మెన్ నరేష్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

