మరో వంద రోజుల్లో “అవతార్ ది వే ఆఫ్ వాటర్”
జేమ్స్ కామెరూన్ నిర్మిస్తున్న మరో అద్భుత సృష్టి అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమాను మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఓ పోస్టర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. భారీ రెక్కలు ఉన్న ఓ వింత జీవిపై ఎక్కిన హీరో అవతార్ నీళ్లల్లో నుండి బయటకు వస్తున్న ఫోటోలో కనిపస్తాడు. దాని వెనుక 100 డేస్ అని రాసి ఉంది. దీంతో ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ముందు వచ్చిన అవతార్ 1 సినిమా గ్రాఫిక్స్ , స్టోరీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.