NationalNews Alert

ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ … రేపట్నుంచి పేటీఎంలో టికెట్లు…

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. భారత్- ఆస్టేలియా మధ్య ఈ నెల 20 నుంచి టీ20 సీరిస్ ప్రారంభం కానుంది. అయితే 25న జరిగే 3వ టీ20 మ్యాచ్ ఉప్పల్‌లోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియాంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా టికెట్లు రేపటి నుంచి పేటీఎం వెబ్‌సైట్లో విక్రయించనున్నారు. విద్యార్థులకు టికెట్ ధరపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొదటి T20 మ్యాచ్ సెప్టెంబర్ 20న మొహలి (పంజాబ్ క్రికెట్ అసోసియేషన్) స్టేడియంలో జరుగుతుంది. సెప్టెంబర్ 11నుంచి టిక్కెట్ విక్రయిస్తున్నారు. రెండవ T20 సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇది భారతదేశంలోని సౌకర్యాలతో కూడిన అత్యుత్తమ స్టేడియంలలో ఒకటి.