బంజారాహిల్స్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి
బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళా కానిస్టేబుల్ మీద దాడిచేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన బుధవారం బంజారాహిల్స్ లో జరిగింది. తెలిసిన వివరాల మేరకు బంజారాహిల్స్ రోడ్ నం.12లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న మహిళకు,బైక్ పార్కింగ్ చేసే వాహనదారులకు మధ్య వివాదం చెలరేగింది.అది కాస్త నలుగురు బైకిస్టులు కలిసి దాడి చేసేంత వరకు వెళ్లింది. అంతే కాదు సదరు మహిళా కానిస్టేబుల్ సోదరునిపైనా బైకిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

