ఏనుగు దంతపు బొమ్మలు విక్రయిస్తూ అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ మరణించినా.. ఆయన ఆశయాలను మాత్రం కొంత మంది కొనసాగిస్తూనే ఉన్నారు. వన్యప్రాణులను వేటాడి వాటి కళేబర ఉత్పత్తులను తయారు చేసి యధేచ్చగా విక్రయించే ముఠా సభ్యులు ఎప్పటికప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు.ఇలాంటి ముఠాని తమిళనాడులోని విల్లుపురం పారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.ఏనుగులను చంపి వాటి దంతాలతో కళాత్మక ఆకృతులు తయారు చేసి మార్కెట్‌లో బహిరంగంగా విక్రయిస్తున్న స్మగ్లర్ లను పట్టుకున్నారు.దీనికి సంబంధించి హోటల్ లో ఓ చోట బేరమాడుతుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయల విలువైన ఏనుగుదంతపు బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

