Home Page SliderNational

జమ్మూలో ఆర్మీ కాన్వాయ్‌పై మళ్లీ తెగబడ్డ ఉగ్రమూక

జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్ జిల్లాలో నేడు ఆర్మీ ట్రక్కుపై ఉగ్రావాదులు దాడులకు తెగబడ్డారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండవసారి దాడులు జరిపారు ఉగ్రవాదులు. ఈ ఆర్మీ ట్రక్కుపై ఆకస్మిక దాడులు జరిగాయని, వారికి సహాయం కోసం ఆర్మీ బలగాలను పంపారని సమాచారం. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.