చేతులను అతిగా శుభ్రం చేస్తున్నారా ? అయితే ఇది మీకోసమే..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం. మనం శుభ్రంగా ఉంటే ఏ రోగాలు మన దరి చేరవు. కాని దానిని అతి చేస్తేనే ప్రమాదం అంటున్నారు నిపుణులు.
మనం తరచుగా అన్నం తినేటప్పుడు, తిన్నాక, తుమ్మినప్పుడు చేతిని అడ్డుపెట్టుకున్నప్పుడు గాని చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటాం. కాని ఈ అలవాటును అతిగా తీసుకోవడం మీ చర్మానికి మంచిది కాదు. తరచుగా హ్యాండ్‌వాష్ చేయడం లేదా హ్యాండ్ శానిటైజర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు పుట్టి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ఇది చర్మాన్ని దాని సహజ నూనెలను తీసివేసి, పొడిగా, ఎరుపుగా మరియు చికాకును కలిగిస్తుంది. కాబట్టి రోజుకు 5 నుండి 10 సార్లు చేతులు కడుక్కుంటే చాలు అని డాక్టర్లు సూచిస్తున్నారు.