Breaking NewscrimeHome Page SliderNationalTelangana

న‌క్స‌లైట్ల పేరిట అవార్డులేంట‌య్యా..మైండుందా?

సీఎం రేవంత్ రెడ్డికి దిమాక్ ఉందో లేదో త‌మ‌కైతే అర్ధం కావ‌డం లేద‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు.గ‌ద్ద‌ర్ పేరిట అవార్డులివ్వ‌డం ఆక్షేప‌ణీయం అన్నారు.మావోయిస్టులు….కాంగ్రెస్‌,బీజెపి,టిడిపి ల‌కు చెందిన మూడు పార్టీల ప్ర‌ధాన నాయ‌కుల‌ను చంపేశార‌ని గుర్తు చేశారు.ఎంపి డికే ఆరుణ తండ్రి, ప్ర‌స్తుత రేవంత్ క్యాబినెట్ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు తండ్రి ఇలా అనేక మందిని చంపేశార‌ని అలాంటి న‌క్స‌లైట్ల పేరిట అవార్డులిచ్చి స‌మాజానికి ఏం సందేశం పంపుదామ‌ని ఇదంతా చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గ‌ద్ద‌ర్ పేరుతో ఇచ్చే అవార్డుల‌ను త‌మ పార్టీకి చెందిన వారు తీసుకోర‌ని స్ప‌ష్టం చేశారు.అవార్డుల‌ను త‌క్ష‌ణమే గ‌ద్ద‌ర్ పేరుతో ఇచ్చే ప‌ద్ద‌తిని మార్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు.