HealthHome Page Slider

బాదం పప్పు పొట్టుతో తింటే ప్రయోజనమా.. హానికరమా..?

కాలం మారుతున్న మానవ జీవన విధానంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవన విధానం, నిద్రవేళలు మారిపోతుండటంతో వ్యాధుల ముప్పు అధికమై కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా.. రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా రోజువారీ ఆహారంలో బాదం పప్పులు, డ్రైఫ్రూట్ల్స్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. చాలా మందికి ఎన్నో రకాల అపోహలు, సందేహాలు ఉంటాయి. బాదం పప్పును ఎలా తినాలి..? బాదం పప్పు పొట్టుతో తినాలా..? పొట్టు లేకుండా తినాలా..? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి.

బాదం పప్పును ఎలా తింటే మంచిది?
సాధారణంగా బాదం పప్పును నానబెట్టి, మరుసటి రోజు పొట్టు తొలగించి తింటాం. నిజానికి పొట్టుతో పాటు వేయించి లేదా పచ్చిగానే తినేవాళ్లు ఉంటారు. కానీ బాదం పప్పును పొట్టు తొలగించి తినడమే ఉత్తమం. బాదం పప్పు పొట్టులో ఉండే ఆఫ్లా టాక్సిన్ బి1 అనే రసాయనం ఉంటుంది. ఇది కాలేయ క్యాన్సర్ కు దారి తీస్తుంది. బాదంపప్పును నానబెడితే మంచి ప్రయోజనాలను అందిస్తుంది. బాదం పప్పును నానబెట్టడం వల్ల వాటి నుంచి, శరీరంలోని కొవ్వును కరిగించే లైపేజ్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. కాబట్టి పోషకాల శోషణ మెరుగుగా జరగడంతో పాటు, అధిక బరువు తగ్గాలనుకుంటే బాదం పప్పును నానబెట్టి, పొట్టు తొలగించి తినాలి.

బాదం పప్పు వల్ల కలిగే ప్రయోజనాలు..
బాదంపప్పును నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో మంచి ప్రొటీన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు సాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ను అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన బాదం పప్పులో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే గుండెకు చాలా మంచిది. ఇవి గుండెకు కావాల్సిన ఫ్యాటీ ఆమ్లాలను అందజేస్తాయి.

బాదం పప్పు ఎక్కువగా తింటే ఏమవుతోంది..
పచ్చి బాదంపప్పును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే బాదం పప్పు ఎక్కువగా తినడం వల్ల నోటి అలెర్జీ, గొంతు నొప్పి, పెదవులు వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. మీకు గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉంటే బాదంపప్పును తినకూడదని చెబుతున్నారు వైద్యులు.