ఢిల్లీ మహిళలందరికీ నెలకు వెయ్యి సాయం-ఆప్ సర్కార్ నజరానా
ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ని ప్రకటించారు. దీని కింద 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు ₹ 1,000 ఇస్తామన్నారు. అతిషి తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. “కేజ్రీవాల్ ప్రభుత్వం 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి మహిళకు నెలవారీ మొత్తాన్ని ₹ 1,000 ఇస్తుంది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద, మహిళలకు ఈ ప్రయోజనం ఇస్తాం” అని ఆమె చెప్పారు. 76,000 కోట్ల వ్యయంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో అతిషి బడ్జెట్‌ను సమర్పించారు. ‘రామరాజ్యం’ కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.