లండన్‌లో ఏపీ ఎమ్మెల్యేకు ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్‌లో తీవ్ర గాయమైంది. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ అక్కడున్న ఓ సూపర్ మార్కెట్‌లో కిందపడిపోయినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరి కుడి భుజానికి తీవ్ర గాయం కాగా.. ఎముక విరిగిపోయిందని చెబుతున్నారు. ఆయనను సర్జరీ కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. బేగంపేటలోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. సుజనా చౌదరికి తీవ్ర గాయమైనట్లు తెలియడంతో బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు.