Andhra PradeshHome Page Slider

వాలంటీర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ మంత్రి

ఏపీ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఏపీ వాలంటీర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లను ఉద్యోగంలో కొనసాగిస్తామని ప్రకటించారు. చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ, తమను కూడా ఉద్యోగంలో తీసుకోవాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ సందర్భంలో మంత్రి ప్రకటన కీలకంగా మారింది. అయితే ఆయన ప్రస్తుతం రాజీనామా చేయని వారిని కొనసాగిస్తామని, మిగిలిన వారిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. జూలై 1న వాలంటీర్ల ద్వారానే ఇంటివద్ద పెన్షన్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.