Andhra PradeshHome Page Slider

నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు:నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ FRBMను పర్యవేక్షిస్తోందన్నారు. కాగా ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే ప్రభుత్వం అప్పులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇవాళ జరిగిన లోక్‌సభ సమావేశాల్లో ఏపీ అప్పులపై  వైసీపీ ఎంపీ రఘురామ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. అయితే ఏపీ అప్పులు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం 2023 నాటికి ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లకు చేరినట్లు ఆమె వెల్లడించారు. కాగా ఈ నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం రూ.1,77,991 కోట్లు అప్పు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.