వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు. సీఎం ఇవాళ అసెంబ్లీలో దీనిపై మాట్లాడుతూ..వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వరదల నేపథ్యంలో జిల్లా మంత్రులు తక్షణమే వరద బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు వెంటనే రూ.3000 రూపాయల సాయం అందించాలన్నారు. మరోవైపు అధికారులు కూడా పంట నష్టం వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. అయితే పైనుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు గతంలో కంటే ఎక్కువ పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు.

