Andhra PradeshHome Page SliderNews AlertPolitics

వల్లభనేని వంశీకి మరో షాక్..

వైసీపీ నేత వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు మరో షాక్ ఇచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీకి, అతని అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లుగా వీరిపై కేసు నమోదయ్యింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతినిచ్చింది. ఇటీవలే సత్యవర్థన్‌పై దాడి కేసులో బెయిల్ మంజూరు అయిన వంశీకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో ఇంకా బెయిల్ లభించలేదు. దానికి తోడు మరో కేసులో రిమాండ్ విధించడంతో అతడికి ఊరట దక్కలేదు.