సినిమాల్లో మరో కొత్త వారసుడు……!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా కొన్ని నెలలుగా శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ యాక్టర్స్‌ని రంగంలోకి తీసుకువచ్చాడు విష్ణు. సౌత్, నార్త్ టాప్ నటీనటులు ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఒక స్పెషల్ రోల్ లో ఈ మూవీలో నటించబోతున్నారు అని తెలిసిందే . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా కన్నప్ప సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మూవీ టీం రివీల్ చేశారు. ఆగస్ట్ 26న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ మూవీ నుంచి మంచు విష్ణు తనయుడు అవ్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో అవ్రమ్ కనిపించనున్నాడు. ఈ పోస్టర్ ను మోహన్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కొడుకు ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు మంచు విష్ణు. కన్నప్ప మూవీ అవ్రమ్ లుక్ లాంచ్ చేసినందుకు గర్వంగా ఉందని ఎమోషనల్ ట్విట్ చేశాడు . కన్నప్ప మూవీలో ప్రీతి ముకుందన్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం.

