పాక్‌పై మరో మెరుపు దాడి
పాక్‌లోని కీలక నగరాలపై భారత్ దాడులు ప్రారంభించింది. పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. దీనికోసం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి, పాక్ మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేసింది భారత్. ముఖ్యంగా ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేశారు. చైనా నుంచి పాక్ తెచ్చుకున్న HQ9 క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది భారత్. ఈ నేపథ్యంలో భారత్‌పై మరోసారి దాడికి తెగబడింది పాక్. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి భారత్ బలగాలు. పాక్ క్షిపణులను గాలిలోనే కూల్చివేసింది భారత్. లాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో పాక్ దాడులు చేస్తోంది. భారత్‌లోని జమ్ము, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. భారత్‌లోని 15 సైనిక పోస్టులపై దాడికి ప్రయత్నించింది. భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని పాక్‌కు హెచ్చరిక జారీ చేసింది భారత్.