మయన్మార్‌లో మరోసారి భూకంపం
మయన్మార్‌లో మరోసారి భూకంపం కలకలం రేపింది. నిన్న రాత్రి 11.56 గంటలకు మయన్మార్‌లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైందని పేర్కొంది. కాగా ఇప్పటివరకు ఈ భూకంపాలకు మయన్మార్‌లో 200 మందికి పైగా చనిపోయారు. అనధికార లెక్కల ప్రకారం ఆ సంఖ్య 1,000 వరకు ఉండొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.

