ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్టు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బుధవారం రెండో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇండోస్పిరిట్ సంస్థ ఎండీ సమీర్ మహేంద్రును తన ఇంట్లోనే కొన్ని గంటల పాటు ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలు, అవకతవకల్లో సమీర్ పాత్ర ఉందని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో ఏఎంఎల్ కంపెనీ సీఈవో విజయ్ నాయర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. ఆ మరునాడే సమీర్‌ను అరెస్టు చేయడం విశేషం. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్‌కు సమీర్ కోటి రూపాయలు బదిలీ చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్నది.విజయ్ నాయర్ తరఫున సమీర్ నుంచి సిసోడియాకు మరో సన్నిహితుడు అర్జున్ పాండేకు రూ.2-4 కోట్లు అందినట్లు సీబీఐ తెలిపింది.