Home Page SliderNational

హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న అనంత్-రాధికల పెళ్లి వేడుక

భారతదేశ అపర కుబేరుడు,ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల వివాహం ఈ నెల 12న జరగనున్న విషయం తెలిసిందే.అయితే అనంత్-రాధికల వివాహ వేడుక లైవ్ స్టీమింగ్ హక్కులను హాట్‌స్టార్ దక్కించుకుంది. ఈ మేరకు జూలై 12న “శుభ్ వివాహ్” పేరుతో దీనిని ప్రసారం చేయనుంది. కాగా 13న శుభ్ ఆశీర్వాద్,14న మంగళ్ ఉత్సవ్‌తో ఈ వివాహ కార్యక్రమాలు ముగియనున్నాయి. అయితే అంబానీ ఇంట జరగబోయే ఈ సంబరాలను హాట్ ‌స్టార్‌లో వీక్షించొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఇప్పటికే వీరి సంగీత్ వేడుక నిన్న అంగరంగ వైభవంగా జరగింది. కాగా ఈ సంగీత్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రపంచ ప్రఖ్యాత సింగర్ జస్టీన్ బీబర్ రూ.83కోట్ల భారీ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.