Andhra PradeshHome Page Slider

తిరుపతిలో ఆకట్టుకుంటున్న కలశ గణనాథుడు..

తిరుపతిలోని యాదవ వీధి, సున్నపువీధికి చెందిన వినాయకమండపం అందరినీ ఆకట్టుకుంటోంది. 1800 రాగికలశాలతో కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలుగకుండా ప్రత్యేకంగా ఇలాంటి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. స్వచ్ఛమైన రాగితో 11 రోజులపాటు 4గురు ఆర్టిస్టులు 10మంది సహాయంతో గణనాధుని విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కలశాలపై అష్టలక్ష్మి ప్రతిమను చెక్కారు. ఈ కలశాలను 9 వరోజు భక్తులకు పంపిణీ చేస్తామని తెలిపారు. హుండీని కూడా కలశం ఆకారంలో తయారు చేశారు.