పవన్ కళ్యాణ్‌పై అంబటి సెటైర్లు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. ‘పుష్ప-2’ చిత్రం తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ 27 రోజుల తర్వాత స్పందించి, నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సరైన పనే అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించలేదని, దీనితో మానవత్వ కోణం కనిపించలేదని కూడా పవన్ పేర్కొన్నారు. పైగా ‘గోటితో పోయే దానికి గొడ్డలి’ వరకూ తెచ్చుకున్నారని అర్ధం కాని స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీనితో ఇప్పటికైనా మనసులో మాట బయటపెట్టారంటూ ఎద్దేవా చేశారు అంబటి. పవన్ ఈ ఘటనపై ఏం చెప్తాడో అంటూ ఇన్ని రోజులుగా ఎదురు చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ మాటలతో మండిపడుతున్నారు.


 
							 
							