చంద్రబాబు పై అంబటి ఫైర్
మీడియా వేదికగా చంద్రబాబు పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే ప్రధాన కారమన్నారు. చంద్రబాబు తీసుకున్న అవివేక నిర్ణయం వల్లే కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని , పోలవరం చర్చకు సిద్ధమా అని మీడియా వేదికగా ప్రశ్నించారు. అసలు 2018 కల్లా పూర్తి కావల్సిన పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని విమర్మించారు. శాసన సభ వేదికగా పోలవరంపై చర్చిద్దాం రండి , ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పోలవరంపై చర్చిద్దాం అంటే అసెంబ్లీకి రానంటున్నారని దుయ్యబట్టారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పాదయాత్ర చేసారని , అసలు అమరావతి అనేది ఓ పెద్ద స్కామ్ అని స్పష్టం చేశారు. అమరావతికి స్కామ్‌కు చంద్రబాబే పునాది వేశారని అంబటి విమర్శలుగుప్పించారు.

