Home Page SliderInternational

అమెజాన్ చీఫ్ రెండో పెళ్లి..ఖర్చు రూ.5 వేల కోట్లు

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరులలో ఒకరు. ఆయన తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను వచ్చేవారం వివాహం చేసుకోనున్నారు. 2019లో తన భార్య మెకంజీ స్కాట్‌కు 25 ఏళ్ల వివాహ జీవితం అనంతరం విడాకులు ఇచ్చారు. వీరికి 4గురు సంతానం. అనంతరం ఆయనది ఇది రెండవ పెళ్లి. ఈ పెళ్లికి ఏకంగా 600 మిలియన్ డాలర్లు( రూ.5 వేల కోట్లు) ఖర్చు చేయనున్నట్లు అంచనా. కొలరాడోలోని ఆస్పెన్‌లో ఈ నెల 28న వీరి వివాహం జరగనుంది.  ఒక విలాసవంతమైన హోటల్స్, ప్రైవేట్ భవనాలు అతిథుల వసతి కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి బిల్‌గేట్స్, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో, జోర్డాన్ రాణి రానియా వంటి ప్రముఖులు హాజరు కానున్నారు.